Yuzvendra Chahal: విడాకులపై మౌనం వీడిన యజువేంద్ర చాహల్.. సూసైడ్ ఆలోచనలు వచ్చాయన్న క్రికెటర్
Yuzvendra Chahal: చీటింగ్ ఆరోపణలను తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్లు క్రికెటర్ చాహల్ తెలిపాడు. ఓ దశలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని తెలిపాడు.
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal).. తన భార్య ధనశ్రీకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ దశలో సోషల్ మీడియాలో అందర్నీ అట్రాక్ట్ చేసిన ఆ జంట.. అయిదేళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పింది. ఆ సమయంలో చాహల్ చీటింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఎలా తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయో అతను చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. చాహల్, ధనశ్రీలు 2020లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరూ కెరీర్ దృష్ట్యా బ్రేకప్ అయ్యారు. అయిదేళ్లకే విడిపోయారు. అయితే విడాకుల విషయాన్ని కొన్నాళ్లు దాచారు. ఆ సమయంలో చాహల్‌పై చీటింగ్ ఆరోపణలు వచ్చాయి.
విడాకులు తీసుకున్న సమయంలో తనను చీటర్ అని ఆరోపించారని, కానీ తన జీవితంలో ఎవర్నీ చీట్ చేయలేదన్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదన్నాడు. తనకన్నా నమ్మకమైన వ్యక్తి మరొకరు ఉండరన్నాడు. నాతో క్లోజ్‌గా ఉన్నవాళ్ల కోసం నా గుండె నుంచి ఆలోచిస్తానన్నాడు. ఇస్తానే తప్ప, తానేమీ డిమాండ్ చేయనన్నాడు. ఎవరికీ ఏమీ తెలియనప్పుడు, వాళ్లు నిందించడం మొదలుపెట్టారని, అప్పుడు మనం ఆలోచనల్లోకి వెళ్లాల్సి వస్తుందని చాహల్ అన్నాడు.
తనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారని, వాళ్లతో కలిసి చిన్నతనం నుంచి పెరిగానని, మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు అని, వాళ్లను గౌరవించే పద్ధతులను పేరెంట్స్ నేర్పించారని, నా చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నానని, తన పేరును మరొకరితో జోడించి రాయడం, అది కేవలం వ్యూవ్స్ కోసం మాత్రమే రాస్తారని చాహల్ తెలిపాడు.
వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు రావడంతో తన మానసిక ఆరోగ్యం కొంత ఒడిదిడుకులకు లోనైందన్నారు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపినట్లు చెప్పాడు. డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లు వెల్లడించాడు. జీవితం మీద విరక్తి వచ్చిందని, రోజూ రెండు గంటల పాటు ఏడ్చేవాడినని, కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని, అలా 50 రోజులు జరిగిందన్నాడు. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నానని, క్రికెట్లో బిజీగా ఉండడం వల్ల ఏకాగ్రత కుదరలేదన్నాడు. తనకు కలిగిన సూసైడ్ ఆలోచనల్ని తన స్నేహితుడితో షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో భయం వేసిందన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

