ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే అతను ఎటువంటి కారణాలను వెల్లడించలేదు. జూన్ 25వ తేదీ నుంచి పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్నది. జూలై 20వ తేదీ వరకు ఆ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌కు వెళ్తుంది. జూలై 21 నుంచి ఆగస్టు 24 వరకు 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నది. బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ లేకుండానే పాక్ జట్టు ఇంగ్లండ్, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ప్లేయర్ల ఎంపిక తీరు పట్ల యూనిస్ ఖాన్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. యూనిస్‌ను దూరం చేసుకోవడం లోటేనని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ తెలిపారు.