లిమా (పెరూ): ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో సిమ్రన్ప్రీత్ కౌర్ 33 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సున్ యుజి (34, చైనా), యావో జియాన్జున్ (29, చైనా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఇదే విభాగంలో పోటీపడ్డ మను భాకర్ (22), ఇషాసింగ్ (17) వరుసగా నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు. మరోవైపు 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్లో రుద్రాంక్ష్, ఆర్య జోడీ రజతం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత ద్వయం 11-17తో నార్వే జోడీ చేతిలో ఓటమిపాలైంది.