ముంబై: ఇండియన్ స్కాష్ ఓపెన్లో భారత యువ ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అనాహత్ 11-6, 9-11, 11-8, 11-2తో తన్వి ఖన్నాపై అద్భుత విజయం సాధించింది.
ప్రత్యర్థి తన్విపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అనాహత్ వరుసగా రెండోసారి టైటిల్ పోరులోకి దూసుకెళ్లింది. ఆదివారం రెండో సీడ్ హనా మోతాజ్తో అనాహత్ అమీతుమీ తేల్చుకోనుంది.