న్యూఢిల్లీ: వాషింగ్టన్ వేదికగా జరుగుతున్న ఫైర్ స్కాష్ ఓపెన్‌లో భారత యువ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్సింగ్ 8-11, 8-11, 11-7, 11-8, 11-7తో సనా ఇబ్రహీం(ఈజిప్టు)పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో తొలి రెండు గేములను చేజార్చుకున్న అనాహత్ పుంజుకుని పోటీలోకి వచ్చింది. మూడు, నాలుగు గేముల్లోనూ ఒక దశలో వెనుకంజలో ఉన్నా..మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.