హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫ్రాన్స్ వేదికగా జరిగిన కాపెల్లె ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకంతో మెరిశాడు. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన టోర్నీలో రిత్విక్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 9 రౌండ్లలో ఈ యువ జీఎం 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 26 దేశాల నుంచి 533 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో రిత్విక్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. తొమ్మిదింటిలో ఆరు గెలిచిన ఈ తెలంగాణ జీఎం రెండు డ్రా చేసుకుని ఒక దాంట్లో ఓటమి ఎదుర్కొన్నాడు. ఇదే టోర్నీలో బోయెర్ మహేల్(ఫ్రాన్స్), ఇనియాన్ పన్వీర్సెల్వం వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.