Raja Rithvik | యూఏఈ: ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్ టోర్నీకి భారత యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ఈ మెగాటోర్నీలో భారత్ తరఫున రిత్విక్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆల్ ఐన్(యూఏఈ) వేదికగా ముగిసిన ఏషియన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలువడం ద్వారా రిత్విక్..చెస్ ప్రపంచకప్ బెర్తు దక్కించుకున్నాడు. శుక్రవారంతో ముగిసిన టోర్నీలో టాప్-10లో నిలిచిన ప్లేయర్లు నేరుగా ఈ మెగాటోర్నీకి అర్హత సాధిస్తారు. 33వ సీడ్‌గా బరిలోకి దిగిన రిత్విక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో ఈ యువ జీఎం 6.5 పాయింట్లు దక్కించుకున్నాడు. 33 దేశాలకు చెందిన 154 మంది టాప్ ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. భారత్, జపాన్, చైనా, మలేషియా, ఖతార్, సింగపూర్ లాంటి దేశాల ప్లేయర్లు గట్టిపోటీనిచ్చారు. చెస్ ప్రపంచకప్‌లో భారత్ నుంచి రిత్విక్తో పాటు నిహాల్ సరీన్, ఇనియాన్, నారాయణన్, ప్రణేశ్, హర్షవర్ధన్, కార్తీకేయన్ మురళీ ఉన్నారు.
యూఏఈ: ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్ టోర్నీకి భారత యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ఈ మెగాటోర్నీలో భారత్ తరఫున రిత్విక్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆల్ ఐన్(యూఏఈ) వేదికగా ముగిసిన ఏషియన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలువడం ద్వారా రిత్విక్..చెస్ ప్రపంచకప్ బెర్తు దక్కించుకున్నాడు. శుక్రవారంతో ముగిసిన టోర్నీలో టాప్-10లో నిలిచిన ప్లేయర్లు నేరుగా ఈ మెగాటోర్నీకి అర్హత సాధిస్తారు. 33వ సీడ్‌గా బరిలోకి దిగిన రిత్విక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో ఈ యువ జీఎం 6.5 పాయింట్లు దక్కించుకున్నాడు. 33 దేశాలకు చెందిన 154 మంది టాప్ ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. భారత్, జపాన్, చైనా, మలేషియా, ఖతార్, సింగపూర్ లాంటి దేశాల ప్లేయర్లు గట్టిపోటీనిచ్చారు. చెస్ ప్రపంచకప్‌లో భారత్ నుంచి రిత్విక్తో పాటు నిహాల్ సరీన్, ఇనియాన్, నారాయణన్, ప్రణేశ్, హర్షవర్ధన్, కార్తీకేయన్ మురళీ ఉన్నారు.