చెన్నై: యువ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం చెన్నై గ్రాండ్ మాస్టర్స్-2024 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో వరుసగా రెండు విజయాలు నమోదుచేసిన అతడు.. లెవొన్ అరొనియన్ (యూఎస్ఏ)ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. ఆరో రౌండ్లో అర్జున్ ఇరిగేసిని ఓడించిన అతడు.. ఏడో రౌండ్లో ఇరాన్ ఆటగాడు పర్హమ్ మఘ్సుద్లూను చిత్తుచేయడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిచి టైటిల్ రేసులోకి వచ్చాడు.
4.5 పాయింట్లతో అరవింద్, అరోనియన్, అర్జున్ సాధించడంతో ఫైనల్ పోరు టైబ్రేక్‌కు దారితీసింది. ప్లేఆఫ్‌లో అరవింద్‌కు బై దక్కగా అరోనియన్, అర్జున్ గ్రాండ్ ఫైనల్ కోసం తలపడాల్సి వచ్చింది. ఫైనల్లో అర్జున్.. అరోనియన్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లలో ఒకటి డ్రాగా ముగియగా ఇరువురు తలా ఓ విజయం సాధించి 1.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. కానీ రౌండ్ రాబిన్ దశలో మెరుగైన పాయింట్లతో అరోనియన్ గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించగా అర్జున్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.