RR vs GT : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు రోజురోజుకు మారుతున్న వేళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఆరంభంలో తడబడినా.. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న గుజరాత్.. నిలకడలేమితో వెనకబడిన రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం.
జైపూర్ వేదికగా జరుగుతున్న ఆటలో టాస్ గెలిచిన యశస్వీ జైస్వాల్ బౌలింగ్ తీసుకున్నాడు. గత తొమ్మిదింట గుజరాత్ ఆరు విజయాలతో ఆధిపత్యం చెలాయించింది. అయితే.. భీకరఫామ్‌లో ఉన్న వైభవ్, యశస్వీ, పేసర్లు ఆర్చర్, బర్గర్ పవర్ ప్లేలో చెలరేగితే శుభ్‌మన్ గిల్ సేనకు కష్టాలు తప్పకపోవచ్చు.
🚨Toss update from Jaipur🚨@rajasthanroyals won the toss and elected to bowl first against @gujarat_titans
Yashasvi Jaiswal to lead #RR in the absence of Riyan Parag who is injured
Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT pic.twitter.com/XJokqR44ge
— IndianPremierLeague (@IPL) May 9, 2026
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబడ, సిరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, సాయికిశోర్, కుమర్ కుశగ్ర.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), హిట్మైర్, ఫెరీరా, జడేజా, దూబే, శనక, ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేశ్ శర్మ, యశ్‌రాజ్ పుంజా.
ఇంప్యాక్ట్ సబ్స్ – వైభవ్ సూర్యవంశీ, ఆడం మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్.