రోమ్: ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ చేతిలో ఓడటంతో నిద్రలేని రాత్రులను గడిపానని వరల్డ్ నెంబర్ వన్ యానిక్ సిన్నర్ (ఇటలీ) అన్నాడు. ఐదున్నర గంటలు, ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో అల్కరాజ్.. సిన్నర్పై అనూహ్య విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ పురుషల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకున్న విషయం విదితమే.
ఇదే విషయమై తాజాగా సిన్నర్ మాట్లాడుతూ.. ‘క్రీడాకారుల కెరీర్లో ప్రతి మ్యాచ్ ఒక కొత్త ఆరంభం. ఎవరైనా అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అక్కడ (ఫ్రెంచ్ ఓపెన్) ఓటమి నన్ను కుంగదీసింది. కొన్ని నిద్రలేని రాత్రులను గడిపా. ఆ బాధను మరిచిపోవడానికి నా కుటుంబం, మిత్రులు నాకు అండగా నిలిచారు. ఇప్పటికీ నేను ఆ మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నా..’ అని తెలిపాడు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత సిన్నర్.. జర్మనీలో జరుగుతున్న హాలే ఓపెన్లో ఆడుతున్నాడు.