WPL 2026 : మహిళల క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మరో ఎడిషన్‌కు సిద్దమవుతోంది. మూడు సీజన్లుగా అభిమానులను స్టేడియాలకు రప్పించిన ఈ మెగా టోర్నీ నాలుగో సీజన్ జనవరిలోనే ప్రారంభం కానుంది. ఐదు ఫ్రాంచైజీలు రీటెన్షన్ జాబితాను సమర్పించడంతో వేలానికి సన్నాహకాలు చేస్తున్న నిర్వాహకలు.. టోర్నీ తేదీలను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారు. క్రిక్‌బజ్ కథనం ప్రకారం జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకూ నాలుగో సీజన్ జరుగనుందని సమాచారం.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుకంగా పురుషుల టీ20 వరల్డ్‌కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరిపారు నిర్వాహకులు. అందుకే.. ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన టోర్నీ ఈసారి జనవరిలోనే షురూ కానుంది. అంతేకాదు మూడో సీజన్ మాదిరిగా కాకుండా డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్‌లను రెండు నగరాల్లో నిర్వహించే అవకాశముంది.
🔟 Days to Go ⏳
The countdown to #TATAWPL Mega Auction has begun 🔥
Catch the #TATAWPLAuction 2026 on November 27 on https://t.co/jP2vYAWukG pic.twitter.com/tQftgx5Zsn
— Women’s Premier League (WPL) (@wplt20) November 17, 2025
రెండు విడతలుగా సాగే ఈ మెగా ఈవెంట్‌కు ముంబై, బరోడాలను వేదికలుగా ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశ మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో.. రెండో దశ మ్యాచ్‌లు బరోడాలోని కోటంబి మైదానంలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు ఆడించనున్నారు. జనవరి 16 నుంచి.. ఫిబ్రవరి 3న ఫైనల్ వరకూ బరోడానే వేదిక కానుందని టాక్. అయితే.. టోర్నీ ఆరంభ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం భారత క్రికెటర్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు రీటైన్ చేసుకున్నాయి. విశ్వవిజేతగా అవతరించిన టీమిండియాలోని సభ్యులైన స్మృతి మంధాన (Smriti Mandhana), జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues), రీచా ఘోష్ (Richa Ghosh)ల బ్యాండు వాల్యూ పెరగడమే కాదు రీటైన్ ధర కూడా కోట్లకు చేరింది. స్వదేశంలో ముగిసిన వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడిన మంధానను రూ.3.50 కోట్ల రికార్డు ధరకు ఆర్సీబీ రీటైన్ చేసుకుంది. వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైన దీప్తి శర్మ (Deepti Sharma)ను యూపీ వారియర్స్ వదిలేసింది.
Here’s how much each WPL franchise has spent to retain their key players ahead of the 2026 mega auction.
With only one uncapped Indian retained, UP Warriorz will enter the auction with the highest remaining purse. #WPL2026 #WPLAuction pic.twitter.com/Pow9zunnka
— CricTracker (@Cricketracker) November 7, 2025
Here’s how much each WPL franchise has spent to retain their key players ahead of the 2026 mega auction.
With only one uncapped Indian retained, UP Warriorz will enter the auction with the highest remaining purse. #WPL2026 #WPLAuction pic.twitter.com/Pow9zunnka
— CricTracker (@Cricketracker) November 7, 2025
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నాయి. స్లాబ్స్ విషయానికొస్తే.. ఒక క్రికెటర్‌కు మాత్రమే రూ.3.5 కోట్లు చెల్లించే అవకాశముంది. రెండో ప్లేయర్‌కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ.1.75కోట్లు, నాలుగో బ్యాటర్‌కు రూ.1 కోటి.. ఐదుగురు ప్లేయర్లకు రూ.50 లక్షలు వేలం పాట పాడాల్సి ఉంటుంది. ఒక ఫ్రాంచైజీ ఐదుగురిని అట్టిపెట్టుకుంటే వాళ్ల పర్స్ నుంచి రూ.9.75 ను తొలగిస్తారు. ఒకవేళ నలుగురిని రీటైన్ చేసుకుంటే.. రూ.8.75 కోట్లు.. ముగ్గురికి రూ.7.75 కోట్లు, ఇద్దరిని రీటైన్ చేసుకుంటే రూ.6 కోట్లు కట్ చేస్తారు.
ముంబై ఇండియన్స్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.7కోట్లు), అమన్‌జోత్ కౌర్(రూ.1.0కోట్లు), జి. కమలిని(రూ.50 లక్షలు). ప్రస్తుతం ముంబై పర్స్‌లో 5.75 కోట్లు ఉన్నాయంతే.
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్,(రూ.2.2 కోట్లు) షఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), మరినే కాప్(రూ.2.2 కోట్లు), అనాబెల్ సథర్లాండ్(రూ.2.2 కోట్లు), నిక్కీ ప్రసాద్ అన్క్యాప్డ్(రూ.50 లక్షలు). ఢిల్లీ పర్స్‌లో రూ.6.75 కోట్లు ఉన్నాయి.
యూపీ వారియర్స్ : శ్వేతా షెరావత్ (రూ.50 లక్షలు). పర్స్‌లో 14.5 కోట్లు ఉన్నాయి.
Official Announcement 📣
We’re thrilled to announce the retention of our Aussie power duo, Ashleigh Gardner and Beth Mooney for the upcoming #WPL cycle! 🧡💪
Two Giants who define consistency, class, and champion mindset. ✨#GujaratGiants #BringItOn #Adani #WPL2026 pic.twitter.com/TEyPw1qvea
— Gujarat Giants (@Giant_Cricket) November 6, 2025
ఆర్సీబీ : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రీచా ఘోష్(రూ.2.75కోట్లు), ఎలీసా పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60లక్షలు)లను మాత్రమే రీటైన్ చేసుకుంది. పర్స్‌లో 6.15 కోట్లు ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్ : బేత్ మూనీ(రూ.3.5కోట్లు), అష్ గార్డ్నర్(రూ.2.5కోట్లు). పర్స్‌లో రూ.9 కోట్లు ఉన్నాయి.