WPL 2024, RCB vs GG | గుజరాత్‌ది అదే కథ.. ఆర్సీబీ ఎదుట స్వల్ప లక్ష్యం
WPL 2024, RCB vs GG | బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది.
WPL 2024, RCB vs GG | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో భాగంగా రెండో మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైంది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. 31 పరుగులతో హేమలత ఆ జట్టు టాప్ స్కోరర్ కాగా స్టార్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్ (2/14), సోఫి మోలినెక్స్ (3/25)లు రాణించారు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ఎప్పటిలాగానే ఆదిలోనే తడబడింది. కెప్టెన్ బెత్ మూనీ (8) రేణుకా సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా లిచ్‌ఫీల్డ్ (5) ఆమె బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయింది. నాలుగో స్థానంలో వచ్చిన వేదా కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు సిగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 31 బంతులాడి 3 బౌండరీల సాయంతో 22 రన్స్ చేసిన హర్లీన్ డియోల్.. రనౌట్ అయింది.
Through the gates 🔥🔥
Renuka Singh gets the Chinnaswamy crowd going 🤩
Gujarat Giants lose Captain Beth Mooney.
Match Centre 💻📱 https://t.co/wV0BEgbN42#TATAWPL | #RCBvGG | @RCBTweets pic.twitter.com/vdw6vQpFZp
— Women’s Premier League (WPL) (@wplt20) February 27, 2024
క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన గుజరాత్ ఓ దశలో వంద పరుగులు అయినా సాధిస్తుందా..? అనిపించింది. కానీ మిడిలార్డర్లో దయాలన్ హేమలత.. బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.
TIMBER!
Wicket number 2⃣ for Sophie Molineux 💪#GG 74/6 in the 17th over.
Match Centre 💻📱 https://t.co/wV0BEgckTA#TATAWPL | #RCBvGG pic.twitter.com/vmMbqbDl4B
— Women’s Premier League (WPL) (@wplt20) February 27, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

