బెల్గ్రేడ్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మహిళల 53కిలోల బౌట్లో వినేశ్ 0-7 తేడాతో ఖులాన్ బత్కుయగ్(మంగోలియా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇటీవలి బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకంతో మెరిసిన వినేశ్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. బౌట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా పట్టు కోల్పోయిన ఫోగట్ మూల్యం చెల్లించుకుంది.