ఆదిలాబాద్, సెప్టెంబరు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాలు, కనివిందు చేసే జలపాతాలు ఉన్న ఆదిలాబాద్ జిల్లా అడ్వెంచర్ పోటీలకు వేదిక కానుంది. ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతంలో వాటర్‌ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూఆర్డబ్ల్యూ సీఈవో) ఆధ్వర్యంలో ప్రపంచ వాటర్‌ఫాల్ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు పోటీలు జరుగనున్నాయి. 330 అడుగుల ఎత్తు ఉండే గాయత్రి జలపాతంలో 2016లో ఫ్రీ వాటర్ ఫాల్ వరల్డ్ కప్ నిర్వహించారు.