కైరో : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత రైఫిల్ షూటర్, వరల్డ్ నంబర్-2 సిఫ్ట్ కౌర్ సమ్రకు అనూహ్య షాక్ తగిలింది. ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో ఆమె 48వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
భారత్కు తప్పకుండా పతకం తీసుకొస్తుందనుకున్న కౌర్.. మూడు పొజిషన్లలో ఒక్కదాన్లోనూ రాణించలేకపోయింది. ఆశి చోక్సీ, అంజుమ్ మోడ్గిల్ వ 15, 17 స్థానాలతో ముగించారు.