న్యూఢిల్లీ : భారత అండర్-18 పురుషుల వాలీబాల్ జట్టు టెహ్రాన్‌లో జరిగిన ఆసియా అండర్-18 చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నది. సోమవారం జరిగిన కాంస్య పోరులో భారత జట్టు 3-2 తేడాతో కొరియాపై గెలుపొందింది. ఆశిష్ స్వైన్, ఆర్యన్ బలియన్, కుష్ సింగ్, కార్తీక్ శర్మ రాణించడంతో భారత జట్టు 25-20, 25-21, 26-28, 19-25, 15-12 స్కోరుతో కొరియాను ఓడించింది. లీగ్ దశలోనూ భారత జట్టు కొరియాపై విజయం సాధించింది.