లండన్: టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్సన్, వీనస్ విలియమ్సన్కు వింబుల్డన్ షాక్ ఇచ్చింది. జూన్ 27 నుంచి మొదలయ్యే గ్రాండ్‌స్లామ్ టోర్నీ జాబితాలో ఈ అమెరికా సోదరీమణుల పేర్లు కనిపించలేదు. మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు 23 సింగిల్స్ టైటిళ్లు సాధించిన సెరెనా గాయం కారణంగా కొంతకాలంగా టెన్నిస్‌కు దూరమైంది.
తాజా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా.. వింబుల్డన్‌లో బరిలోకి దిగాలని భావించినా.. నిర్వాహకులు శనివారం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు పొందుపరచలేదు. ఇక ఆమె సోదరి వీనస్ విలియమ్స్ ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన విషయం తెలిసిందే. వీరిద్దరికి అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశమైంది.