వింబుల్డన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌కు వేళైంది. ఇటీవల ఫ్రెంచ్ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుని పురుషుల సింగిల్స్‌లో మరే ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకున్న రఫేల్ నాదల్ (స్పెయిన్) రెండో సీడ్‌గా బరిలోకి దిగనుండగా.. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) టాప్‌సీడ్‌గా అడుగు పెట్టనున్నాడు. సోమవారం తొలి రౌండ్లో వోన్ సూన్ వూతో జొకోవిచ్ తలపడనుండగా.. మంగళవారం హార్మొనీ టాన్తో అన్‌సీడెడ్ సెరెనా విలియమ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆటగాళ్లకు ఈ టోర్నీలో ప్రవేశం కల్పించకపోవడంతో పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్కు చుక్కెదురైంది. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత తిరిగి రాకెట్ పట్టేందుకు సిద్ధమవుతున్నది. గతేడాది వింబుల్డన్‌లో గాయపడ్డ సెరెనా ఆ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయి మ్యాచ్ ఆడలేదు.