NZ ODI Squad : ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కేన్ విలియమ్సన్ (Kane Williamson) మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన కేన్ మామ పూర్తిగా కోలుకోవడంతో వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగుబోయే సిరీస్‌కు అతడని సెలెక్టర్లు ఎంపిక చేశారు. పొత్తి కడుపుతో గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన యువ బ్యాటర్ నాథన్ స్మిత్ (Nathan Smith)ను కూడా స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. వీరిద్దరి రాకతో కివీస్ బ్యాటింగ్ దళం పటిష్టంగా మారనుంది.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం మిచెల్ శాంట్నర్(Mitchell Santner) సారథిగా స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. ఓపెనర్ డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, వికెట్ కీపర్ టామ్ లాథమ్, విలియమ్సన్తో బ్యాటింగ్ దళం దుర్బేద్యంగా ఉంది. అయితే.. గాయం కారణంగా కీలక ఆటగాళ్లు సిరీస్‌కు దూరమయ్యారు.
Our One-Day squad to face England!
Kane Williamson, Nathan Smith and Tom Latham come into the side 🙌 pic.twitter.com/43hK5FAbEC
— BLACKCAPS (@BLACKCAPS) October 19, 2025
పేసర్ లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, ఫిన్ అలెన్, విలియం ఓ రూర్కీ, ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్, బెన్ సియర్స్లు గాయాలతో బాధపడుతున్నారు. అక్టోబర్ 26న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరుగనుంది. అనంతరం హామిల్టన్‌లో అక్టోబర్ 29న రెండో వన్డే, నవంబర్ 1వ తేదీన వెల్లింగ్టన్లో మూడో వన్డే జరుగనున్నాయి.
వన్డే స్క్వాడ్ : మిచెల్ శాంట్నర్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, నాతన్ స్మిత్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), విల్ యంగ్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫ్ఫీ, జాక్ ఫౌల్కెస్, మ్యాట్ హెన్రీ, కైలీ జేమీసన్.