Greatest Wicket Keeper: చేతుల్తోనే కాదు.. నడుముతోనూ క్యాచ్ పట్టొచ్చు.. చూస్తే వావ్ అనాల్సిందే..
Greatest Wicket Keeper: తమకు ఆమడ దూరంలో బంతి వెళ్తున్నా ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంలో ఒక్కో వికెట్ కీపర్ది ఒక్కో శైలి. కానీ ఇంతవరకూ బహుశా ప్రపంచ క్రికెట్లో ఏ వికెట్ కీపర్ కూడా పట్టని రీతిలో నడుము ద్వారా క్యాచ్ అందుకున్నాడు.
Greatest Wicket Keeper: క్రికెట్లో వికెట్ కీపర్ల విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. నిన్నటి తరం ఆడమ్ గిల్‌క్రిస్ట్ మొదలుకుని ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన విన్యాసాలతో అలరిస్తున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీలు తమవైన స్కిల్స్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించగల సమర్థులు. తమకు ఆమడ దూరంలో బంతి వెళ్తున్నా ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంలో ఒక్కో వికెట్ కీపర్ది ఒక్కో శైలి. కానీ ఇంతవరకూ బహుశా ప్రపంచ క్రికెట్లో ఏ వికెట్ కీపర్ కూడా పట్టని రీతిలో నడుము ద్వారా క్యాచ్ అందుకున్నాడు.
వివరాల్లోకెళ్తే.. కేరళ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కేపీఏ 123 వర్సెస్ కేసీఎస్ఎ కాలికట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే రెండు ఓవర్లలోనే పది పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫిరాజ్ అనే బౌలర్ మూడో ఓవర్ వేయగా.. బంతి కాస్తా బ్యాటర్ ఎడ్జ్‌కు తాకి వికెట్ కీపర్ పక్కదిశగా వెళ్లింది. అదే సమయంలో కీపర్ పక్కకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.
We have a winner.
This is the greatest wicket-keeper catch of all-time! 😂
[h/t @kreedajagat] pic.twitter.com/b9EIKH34JV
— That’s So Village (@ThatsSoVillage) November 9, 2023
అతడు కిందపడే క్రమంలో బంతి.. అతడి కుడి చేతికి తాకి పైకి ఎగిరి అతడి నడుము మీద పడింది. అప్పుడే ఆ కీపర్ బంతి కిందిపడకుండా నడుముకు రెండు చేతులు అడ్డంపెట్టి చాకచక్యంగా ఆపాడు. పక్కనే ఉన్న ఫీల్డర్ వచ్చి కీపర్ మీద ఉన్న బాల్‌ను తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ఇది కదా క్యాచ్ అంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

