WI vs ENG | మూడో వన్డేలో సూపర్ విక్టరీ.. 25 ఏండ్లకు ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన విండీస్
WI vs ENG : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్(West Indies) ఛేజిక్కించుకుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval) మైదానంలో శనివారం జరిగిన మూడో వన్డేలో విండీస్ అద్భుత విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం...
WI vs ENG : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్(West Indies) ఛేజిక్కించుకుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval) మైదానంలో శనివారం జరిగిన మూడో వన్డేలో విండీస్ అద్భుత విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్నిషై హోప్స సేన 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కేసీ కార్టీ(50) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ అలిక్ అథనజె(45), రొమారియో షెఫర్డ్(43) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. దాంతో, 2-1తో విండీస్ సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా సొంత గడ్డపై ఇంగ్లండ్ మీద 25 ఏండ్ల తర్వాత వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
That winning feeling.🏆#WIvENG #WIHomeForChristmas pic.twitter.com/3EwRNx210k
— Windies Cricket (@windiescricket) December 10, 2023
సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేను వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మిడిలార్డర్లో వచ్చిన బెన్ డకెట్(71), లివింగ్‌స్టోన్(45) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఆ తర్వాత విండీస్ బ్యాటింగ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో, రిఫరీలు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విండీస్‌కు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో 2 పరుగులకే ఓపెనర్ బ్రాండన్ కింగ్() ఔటైనా.. మరో ఓపెనర్ అలిక్ అథనజె(45) పట్టుదలగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన కేసీ కార్టీ(50) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రొమారియో షెఫర్డ్(43) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
Keacy Carty battles back with the bat, a well-played 5️⃣0️⃣ to steady the innings🏏🌴 #WIHomeforChristmas #WIvENG pic.twitter.com/mbTtxmqGuE
— Windies Cricket (@windiescricket) December 10, 2023
వన్డే సిరీస్ ముగియడంతో 5 మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌కు వెస్టిండీస్ సెలెక్టర్లు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. రెండేండ్ల తర్వాత ఆండ్రూ రస్సెల్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే పొట్టి ప్రపంచకప్ పోటీలకు సన్నాహాల్లో భాగంగానే సెలెక్టర్లు రస్సెల్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. రస్సెల్‌తో పాటు యువ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫొర్డే, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, కైలి మేయర్స్లు కూడా టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
టీ20 స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), షై హోప్(వైస్ కెప్టెన్), రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫొర్డే, షిమ్రాన్ హిట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్.
ఇవి కూడా చదవండి
- Delhi police | సుఖ్‌దేవ్ సింగ్ హత్య కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్
- Snehwan | రైతుబిడ్డల కోసమే ఈ స్పెషల్ స్కూల్.. ఇక్కడ ఏం నేర్పిస్తారంటే..
- Samantha | డెనిమ్ జీన్స్‌లో కిర్రాక్ పుట్టిస్తున్న సమంత..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

