Curtly Ambrose | సిక్స్‌లు బాదకుంటేనేం.. కోహ్లీ ఆట కనులవిందుగా అనిపిస్తుంది : విండీస్ దిగ్గజం
Curtly Ambrose : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఛేజ్ మాస్టర్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు. తన అద్వితీయ ప్రతిభతో మాజీలచే ప్రశంలందుకున్నాడు. తాజాగా కోహ్లీని వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ కర్ట్లీ అంబ్రోస్(Curtly Ambrose) ఆకాశానికెత్తేశాడు. విరాట్ ఆడుతుంటే కనులవిందుగా...
Curtly Ambrose : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఛేజ్ మాస్టర్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు. తన అద్వితీయ ప్రతిభతో మాజీలచే ప్రశంలందుకున్నాడు. తాజాగా కోహ్లీని వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ కర్ట్లీ అంబ్రోస్(Curtly Ambrose) ఆకాశానికెత్తేశాడు. విరాట్ ఆడుతుంటే కనులవిందుగా అనిపిస్తుందని అన్నాడు. అంతేకాదు అతను అందరిలా సిక్స్‌లు బాదకున్నా, దూకుడుగా ఆడకున్నా వేగంగా పరుగులు చేస్తాడని తెలిపాడు.
‘కోహ్ల అందరిలా సిక్స్‌లు కొట్టే క్రికెటర్ కాదు. అలాగని అతను బంతిని స్టాండ్స్ దాటించలేడని కాదు. కానీ.. సిక్స్‌లు బాదేవాళ్లకంటే వేగంగా పరుగులు సాధిస్తాడు. అదే అతడి ప్రత్యేకత’ అని అంబ్రోస్ వెల్లడించాడు. ఒకప్పుడు విండీస్ మేటి బౌలర్లలో ఒకడైన అంబ్రోస్ 2000 సంవత్సరంలో ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
రికార్డుకు సెంచరీ దూరంలో..
భారత గొప్ప ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ ఈమధ్యే 76వ అంతర్జాతీయ సెంచరీ బాదాడు. రెండేళ్ల క్రితం ఫామ్ కోల్పోయిన ఇప్పుడు వరుస శతకాలతో చెలరేగుతున్నాడు. నిరుడు ఆసియా కప్‌తో మొదలు.. వన్డేలు, టెస్టుల్లోనూ సెంచరీతో రాణించి విమర్శకుల నోళ్లు మూయించాడు. విండీస్ పర్యటనలో రెండో టెస్టుతో కోహ్లీ 500వ మ్యాచ్ ఆడేశాడు.
కోహ్లీ, సచిన్ టెండూల్కర్

చారిత్రాత్మక మ్యాచ్‌లో 121 రన్స్ కొట్టి రికార్డులు తిరగరాశాడు. ఐదొందల మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీని వన్డే రికార్డు ఊరిస్తోంది. మరో 102 పరుగలు సాధిస్తే 13 వేల క్లబ్లో చేరతాడు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్(sachin tendulkar) మాత్రమే 13 వేల మైలురాయికి చేరుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఛేజ్ మాస్టర్ ఈ ఏడాది సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్(ODI WC 2023)లో కీలకం కానున్నాడు.
ఇవి కూడా చదవండి
James Anderson | ‘నాలో ఇంకా చాలా ఆట ఉంది’.. జట్టును వీడనంటున్న వెటరన్ పేసర్
Ashes | యాషెస్ సిరీస్‌లో స్మిత్ రనౌట్ రచ్చ..! ఇండోర్ అంపైర్ నిర్ణయాన్ని ప్రసంశించిన అశ్విన్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

