హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆసియన్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అండగా నిలుస్తామని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ వెల్లడించింది. ఈనెల 15తేదీ నుంచి తైవాన్లో జరుగబోయే ఈ పోటీలకు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు రాణి, ఇందు, మమత ఎంపికయ్యారు.
పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన ప్రయాణ తదితర ఖర్చుల కోసం సొసైటీని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై ‘క్రీడాకారులపై చిన్నచూపు’ పేరిట నమస్తే తెలంగాణలో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై సొసైటీ తాజాగా స్పందించింది. సొసైటీ ప్రకటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.