Rishabh Pant | కార్తీక్‌తో పోటీపై తేల్చేది వాళ్లిద్దరే: పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్‌కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స్పష్టత లేదు. ఆసియా కప్‌తో పాటు అక్టోబర్ నుంచి జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌లో కూడా ఈ ఇద్దరిలోనూ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైనా ఇండియన్ క్రికెట్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్‌తో పోటీతో పాటు తుది జట్టులో ఎవరుంటారు..? అనే విషయమై పంత్ స్పందించాడు. తనకు కార్తీక్‌తో పోటీ లేదని మ్యాచ్‌లో వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తామిద్దరం ఒకే విధంగా కష్టపడతామని పంత్ తెలిపాడు.
ఓ న్యూస్ ఛానెల్‌తో పంత్ మాట్లాడుతూ.. ‘మేము ఇద్దరి మధ్య పోటీ గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా జట్టుకు వంద శాతం బెస్ట్ ఇవ్వాలని బరిలోకి దిగుతాం. అక్కడివరకే మా చేతుల్లో ఉంది. ఇక మా ఇద్దరిలో ఎవరు ఆడతారనేది మా చేతుల్లో లేదు. అది హెడ్ కోచ్, కెప్టెన్లు నిర్ణయిస్తారు. జట్టుకు ఏది అవసరమో అదే వాళ్లు చేస్తారు..’ అని అన్నాడు.
ఈ ఇద్దరూ కలిసి జూన్‌లో స్వదేశంలో ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ సిరీస్‌లో సైతం కలిసి ఆడారు. రాబోయే ఆసియా కప్‌లో కూడా ఈ ఇద్దరూ కలిసే ఆడనున్నారు. మరి నిలకడగా రాణిస్తున్న ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలంటే అది సెలక్టర్లకు కష్టమే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

