TeamIndia | తిరువనంతపురం చేరుకున్న టీమిండియా.. ఆటగాళ్లకు ఘన స్వాగతం
జనవరి 15న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మూడో వన్డే
TeamIndia : శ్రీలంకతో చివరిదైన మూడో వన్డే కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది. టీమ్ బస్సు దిగి హోటల్‌కు వెళ్లిన ఆటగాళ్లకు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. కథాకళి నృత్యకారులతో పాటు కొందరు కేరళ సంప్రదాయ వేషధారణలో డోలు వాయిస్తూ టీమిండియాకు వెల్ కమ్ చెప్పారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. జనవరి 15న (ఆదివారం) గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1ః30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు విజయాలతో భారత్ సిరీస్‌ను గెలుచుకుంది. తొలి వన్డేలో 67 రన్స్ తేడాతో, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దాంతో నామమాత్రమైన మూడో వన్డేలో ఇండియా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశం ఉంది.
పద్మనాభస్వామి ఆలయంలో..
అనంతరం కొందరు ఆటగాళ్లు కేరళలో పాపులర్ అయిన అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్‌లు పద్మనాభస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పంచెలు కట్టుకున్న వీళ్లంతా ఆలయ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Hello Trivandrum 👋🏻
We are here for the 3️⃣rd and final #INDvSL ODI ✅#TeamIndia pic.twitter.com/xzpr7UTCMT
— BCCI (@BCCI) January 13, 2023
Indian players visited Padmanabhaswamy Temple at Trivandrum. pic.twitter.com/S21VxIyGAh
— Johns. (@CricCrazyJohns) January 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

