Wasim Jaffer | అంతటా అహ్మదాబాద్ పరిస్థితులు ఉండవు.. గిల్‌కు మాజీ క్రికెటర్ సలహా ఏంటంటే.?
Wasim Jaffer : ఈ ఏడాది ఆరంభంలో పరుగుల వదర పారించిన భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఎందుకనో వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో శతకాల మోత మెగించిన అతను కరీబియన్ గడ్డపై జోరు కొనసాగించలేక విమర్శల పాలవుతున్నాడు. ఈ రోజు కీలమైన నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌కు మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) ఓ సలహా
Wasim Jaffer : ఈ ఏడాది ఆరంభంలో పరుగుల వదర పారించిన భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఎందుకనో వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో శతకాల మోత మెగించిన అతను కరీబియన్ గడ్డపై జోరు కొనసాగించలేక విమర్శల పాలవుతున్నాడు. టీ20 సిరీస్ (T20 Series)లో చెత్త ప్రదర్శనతో గిల్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ రోజు కీలమైన నాలుగో టీ20 అమెరికాలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌కు మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) ఓ సలహా ఇచ్చాడు. అన్ని పిచ్‌లు అహ్మదాబాద్(Ahmedabad)లా ఉండవని, పరిస్థితులకు తగ్గట్టు ఆడడం అలవర్చుకోవాలని గిల్‌కు సూచించాడు.
‘వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. వచ్చీ రావడంతోనే హిట్టింగ్ చేయడం కుదరదు. అందుకని అలాంటి పరిస్థితుల్లో వేచి చూసి ఆడాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? అన్ని చోట్లా అహ్మదాబాద్ వాతావరణం ఉండదనే విషయం గిల్ తెలుసుకోవాలి. కాబట్టి పిచ్ తీరును అర్థం చేసుకొని ఆడితే అతను మళ్లీ చితక్కొట్టడం ఖాయం’ అని జాఫర్ వెల్లడించాడు. అంతేకాదు గిల్ అలవాటే తనకు కష్టాల్లకి నెడుతుందని ఈ మాజీ ఓపెనర్ అన్నాడు.
శుభ్‌మన్ గిల్

‘గిల్ అందరిలా మొదటి బంతి నుంచే అటాక్ చేయడు. క్రీజులోకి వచ్చాక కొంత టైమ్ తీసుకుని చెలరేగుతాడు. ఒకవేళ బంతి బ్యాట్ మీదకు రాకున్నా సరే అతను బాల్‌ను వెంటాడీ మరీ పరుగులు సాధిస్తాడు’ అని జాఫర్ తెలిపాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అమెరికా వేదికగా నాలుగో టీ20 ఈరోజు జరుగనుంది. మూడో మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా సిరీస్‌లో 1-2తో వెనకబడి ఉంది. అందుని ట్రోఫీ చేజారకూడదంటే హార్దిక్ పాండ్యా బృందానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
శ్రీలంకపై వన్డేలో వంద కొట్టిన గిల్

ఈ ఏడాది గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ యంగ్‌స్టర్ బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో, శ్రీలంకపై వన్డేలో, న్యూజిలాండ్‌పై టీ20లో వంద కొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 16వ సీజన్లోనూ ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్‌లో సెంచరీలతో కదం తొక్కాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో సెంచరీలతో కదం తొక్కిన గిల్

అదేంటో గానీ.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final 2023) మాత్రం నిరాశ పరిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లోనూ గిల్ పెద్దగా రాణించలేదు. అయితే.. ఈ ఏడాది ఆసియా కప్(Asia Cup 2023), సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) వంటి మెగాటోర్నీలో ఈ విధ్వంసక ప్లేయర్ కీలకం కానున్నాడు. కానీ, అతడి ప్రస్తుత ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్‌తో గిల్ మునపటి లయ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
FIFA Womens WC 2023 | మహిళల వరల్డ్ కప్‌లో సంచలనం.. తొలిసారి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
Chateshwar Pujara | వన్డే కప్‌లో శతక్కొట్టిన పూజారా.. త్వరలోనే జట్టులోకి వస్తానంటున్న నయావాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

