FIFA Womens WC 2023 : ఫిఫా మహిళల వరల్డ్ కప్(FIFA Womens WC 2023)లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా (Australia) జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రాన్స్(France)తో హొరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్య విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్(Penalty Shootout)లో 7-6తో గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. యువ ఫుట్‌బాలర్ విక్కీ బెచో( Vicki Becho) గోల్ కొట్టడంతో ఆసీస్ జట్టు సెమీస్ బెర్తు దక్కించుకుంది. కీలకమైన మ్యాచ్ కావడంతో ఇరుజట్లు పోటాపోటీగా తలపడ్డాయి.
అయితే.. నిర్ణీత సమయంలోపు ఎవరూ ఒక్క గోల్ చేయలేకపోయారు. దాంతో, విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. రెండేళ్ల క్రితం ఫైనల్ ఆడిన ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఇంగ్లండ్(England), కంబోడియా(Combodia) జట్ల మధ్య రెండో సెమీస్ ఫైట్ జరుగనుంది. ఫైనల్ బెర్తు కోసం కంగారు జట్టు ఈ మ్యాచ్ విజేతను ఆగస్టు 16న ఢీ కొననుంది. ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్, స్వీడన్ ఆగస్టు 15వ తేదీన ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.