Asia Cup 2023 | ఆసియా కప్ టోర్నీకి బంగ్లాదేశ్ బృందం ఇదే.. లక్కీ చాన్స్ కొట్టేసిన ఇద్దరు యువ క్రికెటర్లు
Asia Cup 2023 : ఆసియా కప్ టోర్నమెంట్(Asia Cup 2023) కోసం బంగ్లాదేశ్ సన్నహకాలు మొదలు పెట్టింది. నిన్ననే షకిబుల్ హసన్(Shakib Al Hasan)ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లా సెలెక్టర్లు ఈ రోజు 17మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. విధ్వంసక ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) స్థానంలో యువ ఆటగాడు హసన్ తమీమ్(Tanzid Hasan Tamim)ను ఎంపిక చేశారు. మరో యంగ్‌స్టర్ షమీమ్ హొసేన్ పట్వారీ...
Asia Cup 2023 : ఆసియా కప్ టోర్నమెంట్(Asia Cup 2023) కోసం బంగ్లాదేశ్ సన్నహకాలు మొదలు పెట్టింది. నిన్ననే షకిబుల్ హసన్(Shakib Al Hasan)ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లా సెలెక్టర్లు ఈ రోజు 17మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. విధ్వంసక ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) స్థానంలో యువ ఆటగాడు హసన్ తమీమ్(Tanzid Hasan Tamim)ను ఎంపిక చేశారు. మరో యంగ్‌స్టర్ షమీమ్ హొసేన్ పట్వారీ(Shamim Hossain Patwary)కు ఈ బృందంలో చోటు దక్కింది.
2020లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో వీళ్లిద్దరూ సభ్యులు. షమీమ్ ఇప్పటివరకూ 17 టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్‌తో తమీమ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. జట్టులోకి తిరిగి రావాలనుకున్న సౌమ్యా సర్కార్(Soumya Sarkar)కు నిరాశే ఎదురైంది. ఈమధ్యే తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) కెప్టెన్‌గా తప్పుకోవడంతో అనుభవజ్ఞుడైన షకిబ్ మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. 2019 వలర్డ్ కప్‌లో జట్టును నడిపించిన అతను యువకులతో నిండిన జట్టుతో అద్భుతాలు చేస్తాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
బంగ్లాదేశ్ బృందం : షకిబుల్ హసన్(కెప్టెన్), లిట్టన్ దాస్, తంజింద్ హసన్ తమీమ్, షమీమ్ హొసేన్ పట్వారీ, నజ్ముల్ హొసేన్ శాంటో, తొవహిడ్ హృదోయ్, ముష్ఫికర్ రహీం, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహ్మూద్, మహెదీ హసన్, నసుమ్ అహ్మద్, అఫిఫ్ హొసేన్, షిరోఫుల్ ఇస్లాం, ఎబాడత్ హొసేన్, మహమ్మద్ నైమ్.
ఈ నెల 30వ తేదీన ఆసియా కప్ మొదలవ్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగున్న ఈ టోర్నమెంట్‌కు శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. నిరుడు ఈ పోటీల్లో ఆతిథ్య లంక చాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో దసున్ షనక సేన పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. అయితే.. ఈసారి వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ పోటీలు జరుగుతున్నాయి.
తమీమ్ ఇక్బాల్, హసన్ తమీమ్

దాంతో, అన్ని జట్లు ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆసియా కప్‌లో గొప్ప రికార్డు ఉన్న భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్ పర్యటనలో దంచి కొట్టిన టీమిండియా ప్లేయర్లు ఆసియా కప్‌లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Ishant Sharma | రూ.500 కోసం మ్యాచ్‌లు ఆడా.. కెరీర్ ఆరంభంపై ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli | ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ ఏమన్నారంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

