e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home స్పోర్ట్స్ సచిన్‌ను చూసి కాపీకొట్టా: సెహ్వాగ్‌

సచిన్‌ను చూసి కాపీకొట్టా: సెహ్వాగ్‌

సచిన్‌ను చూసి కాపీకొట్టా: సెహ్వాగ్‌
  • ఆన్‌లైన్‌ క్రికెట్‌ కోచింగ్‌కు వెబ్‌సైట్‌ ప్రారంభం

ముంబై: క్రికెట్‌ దిగ్గజం, తన సుదీర్ఘ సహచరుడు సచిన్‌ టెండూల్కర్‌ను చూసి తాను షాట్లు కాపీ కొట్టిన విషయాన్ని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తుచేసుకున్నాడు. 1992 ప్రపంచకప్‌లో సచిన్‌ ఆటను టీవీలో తొలిసారి చూశానని, ఆ తర్వాత అతడిలా స్ట్రయిట్‌ డ్రైవ్‌లు కొట్టడం నేర్చుకున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లకు ఆన్‌లైన్‌ క్రికెట్‌ పాఠాలు నేర్పేందుకు సెహ్వాగ్‌, మాజీ ప్లేయర్‌ సంజయ్‌ బంగార్‌ కలిసి ‘క్రికురూ’ అనే వెబ్‌సైట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ మాట్లాడాడు. ‘క్రికెట్‌ ఆడేది మైదానంలోనే అయినా ఎక్కడి నుంచైనా చాలా నేర్చుకోవచ్చు. నా వ్యక్తిగత ఉదాహరణనే చెబుతా. 1992 ప్రపంచకప్‌ నుంచి టీవీలో సచిన్‌ ఆటను చూడడం మొదలుపెట్టా. అతడు ఎలా స్ట్రయిట్‌ డ్రైవ్‌లు ఆడుతున్నాడో.. బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లు ఎలా కొడుతున్నాడో నిశితంగా చూశా. అలా నేర్చుకున్నా’ అని వీరూ చెప్పాడు. క్రికురూ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా 30 మంది స్టార్‌ ప్లేయర్లు ఆటలో మెళకువల గురించి చెప్పిన కోచింగ్‌ వీడియోలు ఉండనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సచిన్‌ను చూసి కాపీకొట్టా: సెహ్వాగ్‌

ట్రెండింగ్‌

Advertisement