ఐపీఎల్ ఆదాయంలోనూ కోహ్లీనే కింగ్
పీఎల్‌లో అత్యధిక పరుగులు, శతకాలు వంటి రికార్డులు సృష్టించిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఈ మెగా లీగ్‌లో మరో ఘనత సాధించాడు.
- రూ. 19 వేల కోట్లతో నంబర్‌వన్ ఫ్రాంచైజీగా కేకేఆర్
ముంబై: ఐపీఎల్లో అత్యధిక పరుగులు, శతకాలు వంటి రికార్డులు సృష్టించిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఈ మెగా లీగ్‌లో మరో ఘనత సాధించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం గడించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీతోనే ఉన్న విరాట్ ఇప్పటివరకు అందరికంటే ఎక్కువగా రూ. 230 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ‘ఫనాటిక్ స్పోర్ట్స్ – హరున్’ అనే సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కోహ్లీ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (రూ. 227.2 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 200 కోట్లు) నిలిచారు.
కాగా, లీగ్‌లోని మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల ఉమ్మడి విలువ ప్రస్తుతం రూ. 1.63 లక్షల కోట్లుగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో షారూఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 19,200 కోట్ల పైచిలుకు మొత్తంతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవగా.. ఐదేసి ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ (రూ. 18,400 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 18,400 కోట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత సగటు ఐపీఎల్ జట్టు విలువ 1.8 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 15 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2026
- KKR
- RCB
- Virat Kohli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

