Border Gavskar trophy | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( VIRAT KOHLI) మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. మూడేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్(28th Test century)లో సెంచరీ (100) సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లీకి ఇది 28వ శతకం. అంతర్జాతీయ ఫార్మాట్లలో 75వ శతకం.
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత నుంచి ఫామ్లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. కానీ, అహ్మదాబాద్ ((Ahmedabad test)లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలుపు కష్టమని భావిస్తున్న తరుణంలో కోహ్లీ తన సత్తా చాటుతున్నాడు. చెలరేగి ఆడుతూ సెంచరీ దాటాడు. 240 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 139 ఓవర్లలో 400/5. క్రీజ్లో విరాట్ (100) అక్షర్ పటేల్ (5*) ఉన్నారు.
Virat Kohli scores a Test hundred for the first time in over three years 🎉#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/V3TIf48iVc
— ICC (@ICC) March 12, 2023