Shardul Thakur | శ్రేయాస్ అయ్యర్ పాటకు శార్ధూల్ ఠాకూర్ డాన్స్.. ప్రీ-వెడ్డింగ్ వీడియో వైరల్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇప్పుడు శార్దూల్ ప్రీ-వెడ్డింగ్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సహచరుడు శ్రేయాస్ అయ్యర్ 'తుమ్ జో మెరా సాత్ దో' బాలీవుడ్ పాట పాడుతుంటే శార్దూల్ కూడా గొంతు కలిపాడు. ఆ తర్వాత కాబోయే భార్య మిథాలీ పారుకర్తో కలిసి స్టెప్పులు వేశాడు.
Shardul Thakur : భారత క్రికెట్లో ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తోంది. ఈ ఏడాది ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. రెండు రోజుల క్రితం అతని హల్దీ వేడుక ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శార్దూల్ ప్రీ-వెడ్డింగ్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సహచరుడు శ్రేయాస్ అయ్యర్ ‘తుమ్ జో మెరా సాత్ దో’ బాలీవుడ్ పాట పాడుతుంటే శార్దూల్ కూడా గొంతు కలిపాడు. ఆ తర్వాత కాబోయే భార్య మిథాలీ పారుకర్తో కలిసి స్టెప్పులు వేశాడు. శార్దూల్, మిథాలీ ప్రీ-వెడ్డింగ్ వేడుకకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెళ్లాడు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంట కోసం పాట పాడాడు. ఈ వీడియోను కేకేఆర్ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో షేర్ చేసింది. రెండు రోజుల క్రితం అతని హల్దీ వేడుక ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఎవరీ మిథాలీ..?
శార్దూల్ వివాహం చేసుకునే అమ్మాయి పేరు మిథాలీ పారుకర్. ఈమె 2021 నవంబర్‌లో వీళ్లిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. మిథాలీ స్వగ్రామం మహారాష్ట్రలోని కొల్హాపూర్. మిథీబాయి కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆంత్రోప్రెన్యూర్ అయిన మిథాలీ ఆల్ ది జాజ్ లక్జరీ బేకర్స్ అనే కంపెనీ నడుపుతోంది. ఈ ఏడాది ఐపీఎల్లో లార్డ్స్ శార్దూల్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు.
పదహారో సీజన్లో..
గత సీజన్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిది. అయితే.. అతను దారుణంగా విఫలం అయ్యాడు. దాంతో అతడిని డీసీ ట్రేడ్ పద్థతిలో కేకేఆర్‌కు అప్పగించింది. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. ప్రతి ఫ్రాంఛైజీ సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.
“𝘏𝘢𝘮𝘬𝘰 𝘪𝘵𝘯𝘢 𝘣𝘢𝘵𝘢 𝘥𝘦 𝘬𝘰𝘪, 𝘬𝘢𝘪𝘴𝘦 𝘒𝘒𝘙 𝘣𝘰𝘺𝘴 𝘱𝘦 𝘥𝘪𝘭 𝘯𝘢 𝘭𝘢𝘨𝘢𝘺𝘦 𝘬𝘰𝘪!”🥺🎶
📽️: @TheTrancer10 | #AmiKKR pic.twitter.com/yvmr7fiawm
— KolkataKnightRiders (@KKRiders) February 26, 2023
ఇవి కూడా చదవండి
SLC | మీడియా హక్కులకు బిడ్డర్స్‌ను ఆహ్వానించిన శ్రీలంక క్రికెట్.. రేసులో 4 భారతీయ కంపెనీలు
Border – Gavaskar Trophy | ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్‌లో చెమటోడ్చిన కోహ్లీ, రాహుల్
Meg Lanning | ఐదు ఐసీసీ ట్రోఫీలతో పాంటింగ్, ధోనీలను దాటేసిన ఆసీస్ కెప్టెన్ లానింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

