Mixed Doubles | హో చి మిన్హ్: భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల వియత్నాం ఓపెన్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో భారత జోడీ.. 14-21, 21-10, 21-14తో భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, ఆద్యా వరియత్‌ను ఓడించారు. తొలి గేమ్‌ను దక్కించుకున్నా సతీశ్, ఆద్యా జోడీ చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో తరుణ్ మల్లెపల్లి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు.