Dinesh Karthik | ఆర్సీబీ కోచ్‌గా కార్తిక్.. టైటిల్ కలను నిజం చేస్తాడా..?
Dinesh Karthik : ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) కొత్త అవతారమెత్తనున్నాడు. సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)కు కార్తిక్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.
Dinesh Karthik : ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) కొత్త అవతారమెత్తనున్నాడు. సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)కు కార్తిక్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు మెంటార్‌గానూ ఈ వెటరన్ క్రికెటర్ సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ జూలై 1 సోమవారం అధికారికంగా ప్రకటించింది.
‘ఆర్సీబీ కొత్త తరాన్ని మెరికలుగా మార్చేందుకు బ్యాటింగ్ కోచ్‌గా, మెంటార్‌గా దినేశ్ కార్తిక్ సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ మెగా వేలంతో పాటు, 18వ సీజన్లో కార్తిక్ అనుభవం ఎంతో ఉపయోగపడనుంది’ అని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. దాంతో, బెంగళూరు పురుషుల జట్టు ఐపీఎల్ టైటిల్ కలను కార్తిక్ నిజం చేస్తాడా? లేదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Ready to groom the next generation of talent at RCB is our Batting Coach and Mentor Dinesh Karthik. 🫡
His experience would come in handy leading into the Mega Auction & #IPL 2025 and we just can’t wait! 🤩#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/ETe3TSprbj
— Royal Challengers Bengaluru (@RCBTweets) July 1, 2024
మాటల హోరుతో అలరిస్తూనే..
భారత క్రికెటర్లలో దినేశ్ కార్తిక్ ప్రయాణం విభిన్నమైనది. పడిలేచిన కెరటంలా సాగింది అతడి కెరీర్. అవును. ఓవైపు కామెంటేటర్‌గా మాటల హోరుతో అలరిస్తూనే.. క్రికెటర్‌గానూ మైదానంలో అతడు అదరగొట్టాడు. రెండేండ్ల క్రితం ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో కార్తిక్ 2022లో పొట్టి ప్రపంచ కప్ (T20 World Cup) స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు.

అయితే.. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ఆ మెగాటోర్నీలో ఫినిషర్‌గా కార్తిక్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో, జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అతడి పనై పోయిందిలే అనుకున్న వేళ పదిహేడో సీజన్లో కార్తిక్ ఓ రేంజ్లో ఆడాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఎలిమినేటర్‌లో ఓడిపోవడంతో కార్తిక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికేశాడు. ఆ తర్వాత లెజెండరీ ఆటగాడు టీ20 వరల్డ్ కప్ ఎలైట్ కామెంటరీ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- KTR | గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్‌కు కేటీఆర్ చురకలు
- Rs 2,000 Notes | ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
- Bellamkonda Sai Srinivas | కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

