Rs 2,000 Notes | ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
Rs 2,000 Notes | చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర రూ.2వేల నోట్లు (Rs 2,000 Notes) తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది.
Rs 2,000 Notes | చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర రూ.2వేల నోట్లు (Rs 2,000 Notes) తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.
2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే నిరుడు అక్టోబర్ 7దాకా దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.
Also Read..
Lok Sabha | నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్
Bengaluru Firm | టీమ్ఇండియా విక్టరీ.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన బెంగళూరు సంస్థ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

