KTR | గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్కు కేటీఆర్ చురకలు
KTR | గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | జగిత్యాల : గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తది. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే. గడ్డిపారల్లాంటి మీరు వెళ్లలేదు.. ఒక గడ్డిపోచ మాత్రమే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కవితక్కతో సహా వేల మంది కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగల్లో కలిసిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చింది. అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జిగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

