KSCA : కర్నాటక క్రికెట్ సంఘం తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) ఖరారైనట్టే. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న జరగాల్సిన ఎన్నికలకు ముందే ప్రసాద్ విజయం ఖాయమైంది. ఎందుకుంటే.. ఇతరుల నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం బరిలో ప్రసాద్ ఒక్కరే ఉన్నారు. దాంతో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) బలపరిచిన ఆయన ఏకగ్రీవంగా ఎంపికవ్వడం లాంఛనమే అనిపిస్తోంది. గతంలో ప్రసాద్ 2010 నుంచి 2013 వరకూ కేఎస్‌సీఏ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాలి. కానీ, ఎన్నికల నిర్వహణాధికారి డాక్టర్.బి. బసవరాజు (మాజీ ఐఏఎస్) క్రికెట్ సంఘం నిర్వహణ కమిటీ నుంచి స్పష్టత లేదని.. వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలని పట్టుపట్టారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజు డిసెంబర్ 7న ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. అధ్యక్ష పదవి కోసం గేమ్ ఛేంజర్స్ టీమ్ నుంచి వెంకటేశ్ ప్రసాద్, టీమ్ బ్రిజేశ్ నుంచి కే.ఎన్. శాంత్ కుమార్, కల్పన వెంకటాచార్ నామినేషన్ వేశారు. కానీ, సాంకేతిక కారణాలతో శాంత్ దరఖాస్తును ఎన్నికల అధికారి తిరస్కరించారు. వెంకటాచార్ తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
🚨President of KSCA Venkatesh Prasad said “We are going to work extremely hard to make sure that RCB plays at Chinnaswamy Stadium in the upcoming IPL. We would also work to bring back glory to the Chinnaswamy stadium that it has lost in the recent past”
Follow and Support 👉… pic.twitter.com/lMKqLyMkdG
— Royal Champions Bengaluru (@RCBtweetzz) November 25, 2025
కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రఘురామ్ భట్ నేతృత్వంలోని సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 30న ముగిసిందిది. కొత్త టీమ్ కోసం నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. మసకబారిన కేఎస్‌సీఏకు పూర్వ వైభవం తేస్తానంటున్న మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వెటరన్ ప్లేయర్‌కు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) మద్దతుగా నిలుస్తున్నాడు. దాంతో.. ఎన్నికల్లో విజయంపై దీమాగా ఉన్నాడు వెంకటేశ్ ప్రసాద్. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నస్వామి స్టేడియం చిక్కుల్లో పడిందంటున్న వెంకటేశ్ ప్రసాద్ తాము పగ్గాలు చేపడితే సుపరిపాలన అందిస్తుందని హామీ ఇస్తున్నాడు.
టీమిండియా తొలితరం పేసర్లలో ఒకడైన ఆయన చిన్నస్వామి ఇమేజ్ పెంచుతానని మాట ఇస్తున్నాడు. గతంలో (2013-16) నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్ ఈసారి కేసీఏ చీఫ్‌గా సుపరిపాలన, పారదర్శకత అందించాలని భావిస్తున్నాడు.