RR vs KKR | వైభవ్ మెరిసినా వరుణ్ తిప్పేశాడు.. కోల్‌కతా బోణీ కొట్టేనా..!
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో తొలిసారి కోల్‌కత నైట్ రౌడర్స్ బౌలర్లు మెరిశారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్‌ను 160లోపే కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 155 కొట్టిందంతే.
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో తొలిసారి కోల్‌కత నైట్ రౌడర్స్ బౌలర్లు మెరిశారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్‌ను 160లోపే కట్టడి చేశారు. వైభవ్ సూర్యవంశీ(46) విధ్వంసక ఆటతో భయపెట్టినా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3-14) తిప్పేశాడు. తనకు అచ్చొచ్చిన ఈడెన్‌లో నరైన్ సైతం రాణించగా రాజస్థాన్ మిడిలార్డర్ క్రీజులో నిలువలేకపోయింది. ఆఖర్లో కార్తిక్ త్యాగి(3-22) సంచలన స్పెల్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 155 కొట్టిందంతే.
ఈడెన్ గార్డెన్స్‌లో ఇరగీయాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్పరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి() షాకిచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న రాజస్థాన్‌కు ఓపెనర్లు ఎప్పటిలానే శుభారంభమిచ్చారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ(46) కోల్‌కతా బౌలర్లను భయపెట్టాడు. మరో ఎండ్‌లో యశస్వీ జైస్వాల్(39) సైతం దంచేయగా.. పవర్ ప్లేలో అజేయంగా 63 పరుగులు చేసింది రాజస్థాన్. ఆ ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని 9వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి(3-14) విడదీసి కోల్‌కతాకు బ్రేకిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగు భారీ షాట్ ఆడి రమన్‌దీప్ చేతికి చిక్కాడు.
𝙄𝘾𝙔𝙈𝙄
🎥 Glimpses of Vaibhav Sooryavanshi & Yashasvi Jaiswal’s boundaries from the 81-run opening stand 👏
Scorecard ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/UkiYifNgCJ
— IndianPremierLeague (@IPL) April 19, 2026
కాసేపటికే ధ్రువ్ జురెల్(5) అతడి ఓవర్లోనే స్టంపౌటయ్యాడు. వరసగా రెండు వికెట్లు పడడంతో షాక్‌లో ఉన్న రాజస్థాన్‌ను సునీల్ నరైన్(1-20) సైతం దెబ్బ తీశాడు. ఫామ్‌లో ఉన్న అతడి ఓవర్లో ఆఫ్ సైడ్ షాట్ ఆడి రహానే సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో, చూస్తుండగానే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ రియన్ పరాగ్(12), హిట్మైర్(15)లు నిరాశపరిచారు. వరుణ్ ఓవర్లో స్వీప్ షాట్‌తో బౌండరీ రాబట్టిన పరాగ్.. ఆ తర్వాతి బంతికి బౌల్డయ్యాడు.
TIGHT. ECONOMICAL. GAME-CHANGING. 🎯
Varun Chakaravarthy delivered exactly what the Knights needed to get back in the game! ✨
Watch his spell ▶️ https://t.co/yBsTdN4AeC#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/OzNDsYteFH
— IndianPremierLeague (@IPL) April 19, 2026
రవీంద్ర జడేజా(9), ఫెరీరా(7)లు బ్యాట్ ఝులిపిస్తారనుకుంటే ఈజీగా వికెట్ ఇచ్చేశారు. నరైన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఫెరీరా.. కార్తిక్ త్యాగి(3-22) ఓవర్లో గ్రీన్ చేతికి చిక్కి జడ్డూ వెనుదిరిగారు. ఫలితంగా ఓపెనర్ల జోరుతో రెండొందలకు పైగా కొట్టేలా కనిపించిన రాజస్థాన్ ఆశ్చర్యంగా 155 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

