IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) భారీ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(101) విధ్వంసక సెంచరీతో కదంతొక్కగా.. యశస్వీ జైస్వల్(70 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌కు 166 రన్స్ జోడించి రాజస్థాన్ విజయానికి పునాది వేశారిద్దరు. వైభవ్ ఔటయ్యాక రియాన్ పరాగ్(32 నాటౌట్) ధనాధన్ ఆడి లాంఛనం ముగించాడు. దాంతో, 18వ ఎడిషన్‌లో మూడో విజయం సాధించిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ను కిందికి నెట్టేసి 8వ స్థానానికి ఎగబాకింది.
ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్‌కు కలకాలం గుర్తిండిపోయే రోజు ఇది. రికార్డు పుస్తకాల్లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(101) పేరు నిక్షిప్తమైంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉతికారేస్తూ సిక్సర్లతో రెచ్చిపోయిన ఈ చిచ్చరపిడుగు మెరుపు శతకంతో చెలరేగాడు. దాంతో, రాజస్థాన్ కొండంత లక్ష్యాన్ని అలవోకగా కరిగించి 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
Battle of and for the ages! 👏
14-year-old Vaibhav Suryavanshi showed no signs of nerves against the experienced Ishant Sharma en route to his record 💯 🔥
Relive the eventful over ▶️ https://t.co/hdGemB15vu#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/q3aIEe4Qhg
— IndianPremierLeague (@IPL) April 28, 2025
గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. జోస్ బట్లర్ క్యాచ్ వదిలేయడంతో 2 పరుగలు వద్ద యశస్వీ జైస్వాల్(31)కు లైఫ్ లభించింది. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న వైభవ్.. సిరాజ్ వేసిన మొదటి ఓవర్లో సిక్సర్ బాదేశాడు. ఆ తర్వాత ఇషాంత్‌కు చుక్కలు చూపిస్తూ.. వరుసగా 6, 6, 4.. ఆ తర్వాత 6, 4 బాదాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4 కొట్టి ఐపీఎల్లో తొలి అర్థ శతకం సాధించాడీ 14 ఏళ్ల కుర్రాడు.
A moment he will never forget! 🩷
Vaibhav Suryavanshi earns applause from all corners after his historic knock 🫡👏
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/tcDTCWSWTh
— IndianPremierLeague (@IPL) April 28, 2025
అర్ద శతకం తర్వాత కూడా వైభవ్ జోరు తగ్గించలేదు. ఇషాంత్, సుందర్, రషీద్.. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్లోకే అన్నట్టు ఆడాడీ యువకెరటం. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. ఐపీఎల్లో వంద కొట్టిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే శతకం బాదేసిన వైభవ్.. ఈ లీగ్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు.
Vaibhav Suryavanshi writing his-story 🫡
The 14-year-old became the YOUNGEST player to score a HUNDRED in #TATAIPL 🩷
Updates ▶ https://t.co/HvqSuGgTlN#RRvGT | @rajasthanroyals pic.twitter.com/XyatZYNGYS
— IndianPremierLeague (@IPL) April 28, 2025
అయితే.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు యత్నించి వైభవ్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే రాజస్థాన్ 166 పరుగులు చేసి గెలుపు వాకిట నిలిచింది. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా(4)ను రషీద్ ఎల్బీగా వెనక్కి పంపాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో4, 6, 4 బాదిన కెప్టెన్ రియాన్ పరాగ్(32 నాటౌట్) 16 రన్స్ పిండుకున్నాడు. సుందర్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన పరాగ్ జట్టుకు 8 వికెట్ల విజయాన్ని అందించాడు.
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు చెలరేగగా భారీగా పరుగులిచ్చారు. టాస్ ఓడిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(84), సాయి సుదర్శన్(39) ఎప్పటిలానే శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో, గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది. 6వ ఓవర్ తర్వాత జోరు పెంచిన గిల్ హసరంగ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సుదర్శన్ సైతం దంచేయగసాగాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు థీక్షణ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో సుదర్శన్ పెద్ద షాట్ ఆడబోగా.. రియాన్ పరాగ్ క్యాచ్ సూపర్‌గా అందుకున్నాడు. దాంతో, 93 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
సుదర్శన్ ఔటయ్యాక జోస్ బట్లర్(50 నాటౌట్) జతగా గిల్ వీరవిహారం చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నఅతడిని థీక్షణ ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. కానీ, ఆ తర్వాత బట్లర్ బాదుడు షురూ చేశాడు. స్వీప్ షాట్లతో అలరిస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించిన బట్లర్ ఆఖరి ఓవర్లో డబుల్స్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో అతడికిది నాలుగో ఫిఫ్టీ. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(13) రాణించాడు. దాంతో, ప్రత్యర్థికి 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది గిల్ బృందం.