Chris Gayle: సిక్స్ మెషీన్.. వైభవ్ సూర్యవంశీపై క్రిస్ గేల్ ప్రశంసలు
Chris Gayle: యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించారు. వైభవ్ ఓ కొత్త సిక్స్ మెషీన్ అన్నారు. అసాధారణ రీతిలో సూర్యవంశీ సిక్సర్లు కొడుతున్నట్లు చెప్పాడు. తన ఇన్‌స్టాలో గేల్ రియాక్ట్ అయ్యారు. ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డు మిస్ కావడం దురదృష్టకరమన్నారు.
చండీఘడ్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(Chris Gayle).. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. తాజా ఐపీఎల్లో గేల్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉన్నది. అయితే బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 2012 సీజన్లో గేల్ 59 సిక్సర్లు బాదాడు. ఇక ఇప్పుడు సూర్యవంశీ ఇప్పటికే 65 సిక్సర్లు కొట్టేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అతను ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. 29 బంతుల్లో 97 రన్స్ చేసిన వైభవ్‌పై యూనివర్సల్ బాస్ గేల్ ప్రశంసలు కురిపించారు. వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్ చేస్తున్నాడని, అతనో కొత్త సిక్స్ మెషీన్ అని గేల్ అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గేల్ స్పందిస్తూ వైభవ్ ను సిక్స్ మెషీన్‌తో పోల్చారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో రికార్డును నెలకొల్పే అవకాశాన్ని సూర్యవంశీ మిస్సయ్యాడు. ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసే అవకాశాన్ని వైభవ్ చేజార్చుకున్నాడు. ఆ రికార్డును మిస్ కావడం దురదృష్టకరమని, ఎలాగైనా ఆ రికార్డును అతను అధిగమిస్తాడని వైభవ్‌పై గేల్ ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు సూర్యవంశీ 15 ఇన్నింగ్స్‌లో 680 రన్స్ చేశాడు. యావరేజ్ 45.33గా ఉంది. ఇక స్ట్రయిక్ రేట్ 242.85గా ఉంది. ఓ సెంచరీతో పాటు నాలుగు ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ సీజన్లో వైభవ్ బెస్ట్ స్కోరు 103. 280 బంతులు ఎదుర్కొన్న అతను మొత్తం 55 ఫోర్లు 65 సిక్సర్లు బాదాడు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

