హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 వన్డే సిరీస్‌ను అమెరికా యూత్ క్రికెట్ అకాడమీ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో అమెరికా జట్టు.. 57 పరుగుల తేడాతో టీడీసీఏ లెవన్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 297 పరుగులు చేయగా ఛేదనలో టీడీసీఏ 240 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఫైనల్ అనంతరం టీడీసీఏ వ్యవస్థాపక చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తమపై నమ్మకముంచి అమెరికాలోని వివిధ రాష్ర్టాల క్రికెటర్లను తెలంగాణ గ్రామీణ క్రికెటర్లతో ఆడేందుకు తీసుకొచ్చిన కొలిపాక అరుణ్‌కు ప్రత్యేక కృతజతలు తెలిపారు. ఇక్కడి గ్రామీణ క్రికెటర్లకు టీమ్ఇండియాకు ఆడించడమే టీడీసీఏ లక్ష్యమని ఆయన అన్నారు.