హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనే అమెరికా మహిళల జట్టు కెప్టెన్ కొలన్ అనికారెడ్డి, లెగ్‌స్పిన్నర్ ఇమ్మడి శాన్విని సెంటర్ ఫర్ క్రికెట్(సీఎఫ్‌సీ) ఎక్సలెన్స్ అకాడమీ ఘనంగా సన్మానించింది. ఆదివారం అకాడమీ నిర్వహకులు భరణి, చీఫ్‌కోచ్ జగదీశ్‌రెడ్డి కలిసి అభినందించారు.
అమెరికా అండర్-19 జట్టులో కీలక ప్లేయర్లు ఉన్న వీరు తెలుగు మూలాలు కల్గిన వారు. గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌లో ఐసీసీ లెవల్-3 కోచ్ జగదీశ్‌రెడ్డి దగ్గర వీరు శిక్షణ తీసుకుంటున్నారు. వీరికి సీఎఫ్‌సీ నిర్వాహకులు భరణి క్రికెట్ కిట్లను అందజేశారు. భవిష్యత్లోమరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.