అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న అఫ్గానిస్థాన్.. శుక్రవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలువాలంటే కచ్చితంగా విజయం సాధించడంతో పాటు.. ప్రత్యర్థిని భారీ తేడాతో ఓడించాల్సిన అనివార్య పరిస్థితుల్లో అఫ్గాన్ మైదానంలో అడుగుపెట్టనుంది.
గత మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేకపోవడంతో.. దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి బలగంతో విజృంభించాలని చూస్తున్నది.