FIFA World Cup: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్.. పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో అమెరికా విక్టరీ
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా తొలి విక్టరీ కొట్టింది. గ్రూప్ డీలో పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4-1 గోల్స్ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అమెరికన్ స్టార్ ఫ్లోరియన్ బలోగన్ రెండు సార్లు గోల్స్ చేశాడు. ఇక కెనడా, బోస్నియా మధ్య జురిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇంగిల్‌వుడ్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో ఆతిథ్య దేశం అమెరికా తొలి విక్టరీ కొట్టింది. గ్రూప్ డీలో పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4-1 గోల్స్ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అమెరికా జట్టులో ఫ్లోరియన్ బలోగన్ రెండు సార్లు గోల్స్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లోనే యూఎస్ఏ మూడు గోల్స్ చేయడం గమనార్హం. టోర్నీ ఆరంభంలోనే ఘనంగా బోణీ కొట్టింది. దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆది నుంచి అమెరికా జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్‌లోనే మూడు గోల్స్ చేయడం.. అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి. సెకండ్ హాఫ్‌లో జియో రేనా మరో గోల్ చేశాడు. అయితే వరల్డ్‌కప్ హిస్టరీలో ఒక్క మ్యాచ్‌లో అమెరికా మొత్తం నాలుగు గోల్స్ చేయడం మొదటిసారి. ఖతార్‌లో జరిగిన గత వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచుల్లో అమెరికా కేవలం మూడు గోల్స్ మాత్రమే చేసింది. ఇప్పటి వరకు ఏ వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనైనా మూడు కన్నా ఎక్కువ గోల్స్ ఆ దేశం చేయలేదు. సుమారు 70 వేల మంది ప్రేక్షకులు ఉన్న స్టేడియంలో అమెరికా టీమ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పరాగ్వే తరపున సెకండ్ హాఫ్‌లో మౌరీసియో ఓ గోల్ స్కోరు చేశాడు. అమెరికా జట్టులో డీ బోడాడిల్లా 7వ నిమిషంలో, ఆ తర్వాత బలోగన్ 31, 45వ నిమిషాల్లో, రేనా 90వ నిమిషంలో గోల్స్ చేశారు. పరాగ్వే ప్లేయర్ మౌరిసియో 73వ నిమిషంలో గోల్ చేశాడు.
ఫోలారిన్ బలోగన్ ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు. వాస్తవానికి బలోగన్ ఇంగ్లండ్ లేదా నైజీరియా జట్టుకు ఆడాల్సి ఉంది. కానీ కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల అతను అమెరికాకు ప్రాతినిధ్యం వహించాడు. చివరి దశలో అమెరికా జట్టును ఎంపిక చేయడంతో.. అతను వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే హీరో అయిపోయాడు. బలోగన్ వయసు 24 ఏళ్లు. బ్రూక్లిన్‌లో నైజీరియన్ జంటకు బలోగన్ పుట్టాడు. ఆ తర్వాత వాళ్లు ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. అర్సెనల్ అకాడమీలో చేరాడతను. యూత్ లెవల్ పోటీల్లో ఇంగ్లండ్‌కు ఆడాడు. ఇక అమెరికాకు అండర్18 జట్టులో ఆడాడు. అయితే ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇక నైజీరియా జట్టు ఈ సారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. దీంతో అమెరికా జట్టులో బలగోన్ చోటు సంపాదించాడు.
వరల్డ్‌కప్ టోర్నీలో కో-హోస్ట్‌గా ఉన్న కెనడా తన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. బోస్నియాతో జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్‌తో డ్రా అయ్యింది. బోస్నియా జట్టుకు తొలి హాఫ్‌లోనే గోల్ అయ్యింది. 21వ నిమిషంలో లూకిక్ గోల్ కొట్టాడు. అయితే సెకండ్ హాఫ్‌లో కెనడా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ సీ లారిన్ 78వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో రెండు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

