చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ మరికాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించిన పంజాబ్.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడింది. మరోవైపు ముంబై కూడా ఈసారి సమిష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. లీగ్‌లో ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా, 12 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మురుగన్ అశ్విన్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్ చెప్పాడు.
Toss Update: Captain @klrahul11 wins the toss and he says that @PunjabKingsIPL will bowl first against @mipaltan https://t.co/NMS54FiJ5o #VIVOIPL #PBKSvMI pic.twitter.com/rdTLV53lvn
— IndianPremierLeague (@IPL) April 23, 2021
Match 17. Punjab Kings XI: KL Rahul, M Agarwal, C Gayle, N Pooran, D Hooda, M Henriques, S Khan, F Allen, R Bishnoi, M Shami, A Singh https://t.co/oSv9pZngPE #PBKSvMI #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 23, 2021
Match 17. Mumbai Indians XI: R Sharma, Q de Kock, S Yadav, I Kishan, K Pollard, H Pandya, K Pandya, J Yadav, R Chahar, J Bumrah, T Boult https://t.co/oSv9pZngPE #PBKSvMI #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 23, 2021