HCA | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 5: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సహకారంతో వరంగల్ కేంద్రంగా గత నెల 28 నుంచి అక్టోబర్ 5 దాకా జరిగిన అండర్-19 అంతర్ జిల్లా పోటీల్లో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మొగిలిచర్ల క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
ఆ జట్టులో షాదాబ్ (89) అబ్దుల్ (48) రాణించారు. ఛేదనలో కరీంనగర్.. 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. విఘ్నేష్ (53) కరణ్ (50) కరీంగనర్ విజయంలో కీలకపాత్ర పోషించా రు. ఈ టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టు కు ఎం పిక చేయాలని ఆర్గనైజింగ్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ హెచ్సీఏ అధికారులను కోరారు.