విన్ధోక్(నమీబియా) : వచ్చే యేడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్‌నకు ఉగాండా అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్ పోటీలలో రెండో స్థానంలో నిలిచి నమీబియాతో కలిసి ప్రపంచకప్‌నకు ఉగాండా అర్హత పొందింది.
గురువారం ర్వాండాతో జరిగిన తమ చివరి పోరులో ఉగాండా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ర్వాండా 65 పరుగులకు ఆలౌట్ కాగా, సమాధానంగా ఉగాండా 8.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచకప్‌లో ఆడనున్న అయిదో ఆఫ్రికా దేశం ఉగాండా.