అహ్మదాబాద్: ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకింది. దీంతో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలియడంతో ఆర్సబీ ఈ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేదని బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించారు. ఈ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
లీగ్ ప్రారంభానికి ముందు కూడా ఢిల్లీ ప్లేయర్ అక్షర్ పటేల్, ఇదే నైట్‌రైడర్స్‌కు చెందిన నితీష్ రాణా కూడా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా పలువురు గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకింది. అయితే టోర్నీకి ముందే ప్లేయర్స్‌కు నెగటివ్‌గా తేలడంతో లీగ్ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ప్లేయర్స్ అంతా కఠినమైన బయోబబుల్‌లో ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్ తమ గాయాలకు స్కానింగ్ కోసం వెళ్లినప్పుడు కరోనా బారిన పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
UPDATE: IPL reschedules today's #KKRvRCB match after two KKR players test positive. #VIVOIPL
— IndianPremierLeague (@IPL) May 3, 2021
Details – https://t.co/vwTHC8DkS7 pic.twitter.com/xzcD8aijQ0