Gautam Gambhir | నాకో 2-3 కోట్లు ఇవ్వండి.. చేతులు జోడించి గంభీర్‌ను వేడుకున్న టీవీ ప్రజెంటర్.. వీడియో
Gautam Gambhir : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కోసం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించింది. ఆసీస్ పేసర్ రికార్డు ధర పలకడం వెనుక కోల్‌కతా మెంటార్ గౌతం....
Gautam Gambhir : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కోసం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించింది. ఆద్యంతం ఆసక్తి రేపిన వేలంలో ఈ యార్కర్ కింగ్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొన్నది. ఈ ఆసీస్ పేసర్ రికార్డు ధర పలకడం వెనుక కోల్‌కతా మెంటార్ గౌతం గంభీర్(Gautam Gambhir) పాత్ర ఎంతో ఉంది.
వేలంలో పాల్గొన్న గౌతీ.. స్టార్క్ కోసం ఎన్ని కోట్లైనా పెట్టేందుకు వెనకాడొద్దని ఫ్రాంచైజీకి చెప్పడం చూశాం. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో గంభీర్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. టీవీ ప్రజెంటర్ జతిన్ సప్రూ(Jatin Sapru) స్టార్క్ కోసం కోట్లు కుమ్మరించడం గురించి గౌతీని అడిగాడు. అనతంరం ‘చేతులు జోడించి దేవుడా దయచేసి నాకు రూ.2 లేదా రూ.3 కోట్లు ఇవ్వండి’ అని గంభీర్‌ను సరదాగా వేడుకున్నాడు. అతడలా అడిగేసరికి గౌతీ సైతం పగలబడి నవ్వాడు. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
After Auction Scenes 😂 pic.twitter.com/zB8BWfGY57
— football (@RealFIMDBIMD) December 24, 2023
మినీ వేలంలో పాల్గొన్న గంభీర్

దుబాయ్‌లో డిసెంబర్ 19న జరిగిన మినీ వేలంలో కోల్‌కతా బౌలర్లపై కోట్లు కుమ్మరించింది. ప్యాట్ కమిన్స్(Pat Cummins)ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకోవడంతో స్టార్ పేసర్ అయిన స్టార్క్‌పై కేకేఆర్ కన్నేసింది. అతడి కోసం గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడినా కోల్‌కతా తగ్గలేదు.
మిచెల్ స్టార్క్

అప్పటికే స్టార్క్ ధర రూ. 24 కోట్లు దాటడడంతో కేకేఆర్ ఫ్రాంచైజీ యజమానులు తగ్గాలని చూసినా గౌతీ ససేమిరా అన్నాడు. అనుకున్నట్టుగానే చివరకు 24.75 కోట్లకు స్టార్క్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. సారథిగా కోల్‌కతాను రెండుసార్లు(2012,) ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపిన గంభీర్ ఈమధ్యే సొంతగూటికి వచ్చాడు. 16వ సీజన్లో గౌతీ.. లక్నో సూపర్ జెయింట్స్(LSG) మెంటార్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Yadagirigutta temple | శ్రీరామావతారంలో యాదాద్రి లక్ష్మీనారసింహుడు
- Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్వరం
- DJ Snake | వినూత్న రీతిలో క్రిస్మస్ విషెస్ తెలిపిన ‘DJ స్నేక్’.. హృదయాలను కదిలిస్తున్న పోస్ట్.!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

