యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి(Lakshminarasimha) క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం స్వామివారిని శ్రీరామావతారం( Sri Ramavataram)లో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీరామావతారం అలంకారంలో నరసింహ స్వామి దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.